calender_icon.png 26 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి మహిళల వాలీబాల్ పోటీలు

26-08-2025 01:02:16 AM

జడ్చర్ల: కీ.శే. చర్లకోలా శ్వేతా మొదటి వర్ధంతిని పురస్కరించుకొని  శ్వేతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల వాలీబాల్ పోటీల నిర్వహణ వాల్ పోస్టర్ మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి స్వగృహంలో జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు రిలీజ్ చేశారు. వచ్చేనెల సెప్టెంబర్ 6,7,8 తేదీలలో పోటీలు జడ్చర్ల  డా.బి ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మహిళ క్రీడాకారిణిలు టీం లు పాల్గొన్నారు. మొదటి బహుమతి 60 వేలు, రెండవ బహుమతి 50 వేలు, మూడవ బహుమతి 40 వేలు, నాల్గవ బహుమతి 30 వేలతో పాటు షీల్డ్, మెడల్స్ అందజేయడం జరిగిందన్నారు. క్రీడా కారిణిలకు వసతి, భోజన ఏర్పాట్లు కల్పించడం జరుగుతుందన్నారు.