calender_icon.png 26 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడి చెత్త అక్కడే!

26-08-2025 12:31:24 AM

- అధ్వానంగా ఎల్లంపేట మున్సిపాలిటీ

- నిధులు లేవంటున్న స్పెషల్ ఆఫీసర్

- వ్యాధుల బారినపడుతున్నప్రజలు

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 25:ఎల్లంపేట్ పురపాలిక పరిధిలోని గ్రామాలలో సరియైన విధి నిర్వహణ లేక పారిశుధ్యం పడకేసింది. ఎటు చూసినా చెత్త చెదారంతో వార్డులు ద ర్శనమిస్తున్నాయి. చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో వీధులలో చెత్త పేరుకుపోయి దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం చెత్త సేకరణ వాహనాలు నియమించి పల్లెల్లో పారిశుధ్య నిర్వ హణకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నప్పటికీ పురపాలక సం ఘం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలులో మాత్రం విఫలమయ్యారని ఎల్లంపేట్ పురపాలిక సంఘం పరిధిలోని వీధులలో పేరుకుపోయిన చెత్త చెదారం చూస్తేనే తెలుస్తుంది.

చెత్త తరలించే వాహనాలకు సక్రమం గా ఇంధనానికి డబ్బులు ఇవ్వకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి దీని వలన ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింద ఎల్లంపేట మున్సిపాలిటీ స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని నూతన్ కల్, డబిల్ పూ ర్, కొనయిపల్లి, రాజబొల్లారం, రావల్ కోల్, సోమారం,లింగాపూర్, లాంటి పలు ప్రధానమైనటువంటి,గ్రామలలో సుమారు రెండు నెలలుగా చెత్త సేకరణ ట్రాక్టర్లలో ఇంధనాని కి డబ్బులు లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్క డే ఉండిపోయి దుర్వాసన వెదజల్లుతోందని ఆయా గ్రామాల ప్రజలు విలపిస్తున్నారు.

స్పెషల్ ఆఫీసర్ ఫోకస్ నిల్

 ఎల్లంపేట పురపాలక సంఘం నూతనంగా ఏరుపడ్డ తర్వాత స్పెషలాఫీసర్ కు పాలన పగ్గాలు అప్పగించడంతో పరిస్థితి మ రింత దారుణంగా మారింది. పేరుకు స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు తీసుకున్నారే తప్ప గ్రా మాల్లో సమస్యలను పట్టించుకోవడం లేద న్న విమర్శలున్నాయి. ఫాగింగ్ చేయకపోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లించకపోవడం, వా న నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోకపోవడంతో విష జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

కొంతమంది స్పెషలాఫీసర్ ఫోన్ ద్వారా పంచాయతీ సెక్రటరీలనే గ్రామాల్లో సమస్యల సంగతి చూసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా అత్యవసరం అయితే తమకు కాల్ చేయాలని సూచిస్తున్నారు. బడ్జెట్ ఉ న్నా.. లేకున్నా గతంలో సర్పంచులు ముం దుగా బ్లీచింగ్ పౌడర్ లాంటి వాటిని కొని తెచ్చి బిల్లులు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆఫీసర్ అందుకు చొరవ చూపించకపోవడం, బడ్జెట్ లేదని చెబుతుండడంతో పారిశుధ్య సమస్యలు పెరుగుతున్నాయి.

ఎక్కడ చూసినా చెత్తా చెదారం..

 ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని పలు పంచాయతీలు ఎక్కడికక్కడ చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు గుంతలు, ఖాళీ ప్రదేశాల్లో అడవిని తలపించే గుబురు చెట్లు కని పిస్తున్నాయి. వీటిని ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణ చేయాల్సి ఉంది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చెయ్యలేదని జ్వరపీడితులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.

ఇంటికీ ఇద్దరు ముగ్గురికి పైగా జ్వరంతోపాటు ఒళ్ళు నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు కనీసం పారిశుధ్యంపై దృష్టిపెట్టడం లేదని వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ప్రతినెలా జీతం వస్తున్నా పారిశుధ్య కార్మికులకు మాత్రం సరిగ్గా జీతాలు రావ డం లేదని, దీంతో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు, చెత్త సేకరణ విషయంలో లైట్ తీసు కుంటున్నారని చెబుతున్నారు. 

 ఇప్పటికైనా శానిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

 అంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో శానిటేషన్ వ్యవస్థ లేకపోవడం వల్లనే పారిశుద్ధం పడకేసింది అనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎల్లంపేట పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ తోపాటు కమిషనర్ ని ప్రజలు కోరుతున్నారు.