calender_icon.png 26 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరత సృష్టించి మౌనంగా ఉంటే ఎట్లా..?

26-08-2025 12:43:36 AM

తప్పు కేంద్రాన్ని.. నిందలు రాష్ట్ర ప్రభుత్వం పైన నా?

యూరియాను కొరత పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం 

యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం వెనక ఉన్న అంతరిమేమిటని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందపడుతున్న వేళ యూరియాను కృత్రిమ కొరత పెట్టి రైతులను ఇబ్బందులకు  గురిచేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతకు కారణమైన మోడీ సర్కార్ ను ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించాల్సిన బీ ఆర్ ఎస్ పార్టీ ,పల్లెత్తు మాట అనని కెసిఆర్ వ్యవహారశైలి చాలా విడ్డురంగా ఉందన్నారు. బిజెపి బిఆర్ఎస్ దొంగ బుద్ది, కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని బిజెపి ఎంపీలు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు..

ఒక ఎంపీ పాక్ తో ఆపరేషన్ సిందూర్ యుద్ధం కారణంగా చైనా నుండి రావాల్సిన యూరియా రాలేదు అని ఒకరు అంటున్నారని, మరో ఎంపీ అసలు చైనాతో యూరియా కొనడం లేదు ఎప్పుడో బంద్ అయింది అని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఇది మన రాష్ట్ర బీజేపీ ఎంపీల కు రైతుల పట్ల,రాష్ట్ర ప్రయోజనాల పట్ల వాళ్లకు ఉన్న చిత్త శుద్ధి అన్నారు. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు మునిసిపాలిటీ కి ఎక్కువ, కార్పొరేషన్ కు తక్కువ అని విమర్శించారు. 

ఒకరు రాముడు అంటూ పొద్దుగడుపుతాడు ఇంకో ఆయన తడి బట్టలు ,పొడి బట్టలు ఒట్లు,గట్లు అని మాట్లాడుతారన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు 10 ఏళ్ల వాళ్ళ హయాంలో యూరియా కొరతతో రైతులు చనిపోతే అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతు చనిపోతే మాకేంటి సంబంధం అని,కొత్త సినిమా రిలీజ్ ఐతే టికెట్స్ కోసం క్యూ లైన్లో చనిపోయిన చాలా సంఘటనలు ఉన్నాయి ఆలా చనిపోతే సినిమా వాళ్లకు సంబంధమా? అని చిల్లర మాటలు మాట్లాడడం జరిగిందన్నారు.

అన్నం పెట్టె రైతును అడ్డమైన సంఘటనలతో పోల్చుతూ అవమానంగా మాట్లాడాలని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ మంచి చేయాలని సంకల్పంతో అడుగులు వేస్తుందని తెలిపారు. కేంద్రం చేయవలసిన పనులు రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని టిఆర్ఎస్ బిజెపి నేతలు ఒకసారి స్మరించుకొని ఎవరు తప్పు చేస్తున్నారు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసా అని ఎవరిని చెప్పిన నిజాలను మా వారి మదిలో ఉంచుకుంటారని పేర్కొన్నారు.