26-08-2025 01:18:21 AM
- త్వరలో గెజిట్
- పాత విధానమే అమలు
- దరఖాస్తు ఫీజు రూ. లక్ష పెంపు
కరీంనగర్, ఆగస్టు 25 (విజయ క్రాంతి): క రీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మద్యం వ్యాపారులు ఈసారి జగిత్యాల జిల్లాలో మ ద్యం పాపులను దక్కించుకునేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్న సిండికేట్ వ్యాపారు లు ఉమ్మడి జిల్లాలో అత్యధిక మద్యం అమ్మకాలు జరుగుతున్న జగిత్యాల జిల్లాలో షా పులను దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉ న్నారు. మద్యం టెండర్ల గడువు నవంబర్ ముగుస్తుంది.
డిసెంబర్ 1 నుండి కొత్త మ ద్యం షాపుల కేటాయింపు ఉంటుంది. అయి తే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రా నున్న నేపథ్యంలో నెల రోజుల ముందే టెం డర్ల ప్రక్రియ పూర్తిచేసే ఆలోచనలో ప్రభు త్వం ఉంది. ఈ మేరకు ఇప్పటికే జీవో జారీ చేసింది కానీ గెజిట్ ఇంకా విడుదల చేయలే దు. ఒకటి రెండు రోజుల్లో గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న రెండు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజును మరో లక్ష రూపాయలు పెంచి 3 లక్షలు చేశారు.
ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం జూలై నెలలో 272.96 కోట్ల మద్యం వ్యాపా రం జరిగితే, ఈ సంవత్సరం జూలైలో 290.76 కోట్ల వ్యాపారం జరిగింది. ఒక నెల ను ఉదాహరణగా తీసుకుంటే సంవత్సరంలో 6.52 శాతం పెరిగింది. అయితే ఇం దులో అత్యధికంగా 71 దుకాణాలు ఉన్న జ గిత్యాల జిల్లాలో గత జూలై నెలలో 66.34 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే ఈ సం వత్సరం జూలైలో 77.06 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇది 16.10 శాతం వృ ద్ధి జరిగింది.
అత్యధికంగా మధ్యం షాపులు ఉన్న కరీంనగర్ జిల్లాను తీసుకుంటే ఇక్కడ 94 మధ్యం షాపులు, 34 బార్లు ఉండగా గత సంవత్సరం జూలై నెలలో 103.94 కోట్ల వ్యాపారం జరగగా, ఈ సంవత్సరం జూలై నెలలో 105.16 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇది కేవలం 1.18 శా తం అధికం మాత్రమే పెద్దపల్లి జిల్లాలో 77 మద్యం షాపులు, 15 బార్లు ఉన్నాయి. గత సంవత్సరం ఒక నెల జూలైని తీసుకుంటే 61.30 కోట్ల వ్యాపారం జరుగగా, ఈ సంవత్సరం ఇదేనెల 64.54 కోట్ల వ్యాపారం జరి గింది.
ఇది గత సంవత్సరకంటే 5.28 శాతం అధికం. సిరిసిల్ల జిల్లాలో 48 మధ్యం షాపు లు, 8 బార్లు ఉండగా గత సంవత్సరం జూలై నెలలో 41.38 కోట్ల వ్యాపారం జరుగగా, ఈ సంవత్సరం ఇదే నెలలో 44.04 కోట్ల వ్యా పారం జరిగింది. ఇది 6.43 శాతం అధికం. జగిత్యాల జిల్లాలో 71 మధ్యం పాపులు, 19 బార్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు ఉమ్మడి జిల్లాలోనే అధికంగా ఉండడంతో సిండికేట్ వ్యాపారులు అక్కడి షాపులను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు.