26-08-2025 12:57:04 AM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్, నర్సింగ్ పోస్టులకు, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. స్కూల్ యజమాన్యం స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి మాట్లాడుతూ పీజీ సి ఆర్ టి ఇంగ్లీష్, పి జి సి ఆర్ టి నర్సింగ్ పోస్టులకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపినారు.
పిజిసిఆర్టి ఇంగ్లీష్ కు అర్హతలు సంబంధిత సబ్జెక్టులో పీజీ, బిఎడ్, టెట్ క్వాలిఫై అయినా అభ్యర్థులు అర్హులు అని, అలాగే పిజిసిఆర్టి నర్సింగ్ పోస్ట్ కి బీఎస్సీ నర్సింగ్ అర్హత గల వారు అని. ఈ పోస్ట్ లకు ఆసక్తి ఉన్న మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 7660981739 కు సంప్రదించగలరు.