calender_icon.png 26 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదనపురం బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు

26-08-2025 12:52:06 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మదనపురం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాద్ లో ఆర్ అండ్ బి అధికారులతో ఆర్ అండ్ బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తో పాటు పలువురు సహాచార ఎమ్మెల్యేలతో కలసి పాల్గొని, మదనపురం బ్రిడ్జ్ నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు.

ఈ నేపథ్యంలోనే దేవరకద్ర - కురుమూర్తి దేవస్థానానికి వెళ్లే రహదారి వయా (దేవరకద్ర, మినిగోని పల్లి, గుడిబండ, ముచ్చింతల, అప్పంపల్లి, తిరుమలాపూర్, గూడూర్, కురుమూర్తి దేవస్థానం), జాతీయ రహదారి ఎన్హెచ్- 44 వర్నే టూ కురుమూర్తి దేవస్థానం. వయా (ముత్యాలంపల్లి, పేరూరు, వెంకంపల్లి, కురుమూర్తి దేవస్థానం)పై రెండు రహదారులను డబుల్ రోడ్డు నిర్మించాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రతిపాదనలు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అందచేశారు.

ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి మదనపురం బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి తక్షణమే రూ 5 కోట్ల  నిధులను మంజూరు చేస్తామని, మంగళవారం నాడు సంబంధించిన ఆర్థిక అనుమతులు ఇస్తామని తెలియజేసి, కురుమూర్తి దేవస్థానానికి వెళ్లే రహదారులను డబుల్ రోడ్ల నిర్మాణానికి సానుకూలంగా  ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారికి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే జియంఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.