26-08-2025 12:31:14 AM
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
అశ్వాపురం,(విజయక్రాంతి): ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న కమీషన్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు సోమవారం మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ మణిధర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ ఇప్పటికే అనేక నెలలుగా మా కమీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబాలు జీవనం సాగించడం కష్టమైపోతోంది. పెండింగ్‌లో ఉన్న కమీషన్లను తక్షణమే విడుదల చేయకపోతే మరింత తీవ్రమైన ఆందోళనలకు దిగుతాం అని హెచ్చరించారు. తహసీల్దార్ మణిధర్ రేషన్ డీలర్ల వినతిపత్రాన్ని స్వీకరించి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.