calender_icon.png 26 August, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో 16 మందికి గాయాలు

26-08-2025 12:24:41 AM

 పరిస్థితి విషమం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సాయంత్రం వీధి కుక్కలు, స్థానికులపై దాడి చేశాయి. ఒక్కసారిగా దాడి చేయడంతో 16 మందికి గాయాలయ్యాయి, నలుగురి పరిస్థితి విషమంతో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ అమర్ సింగ్ పర్యవేక్షణలో గాయపడిన వారిని చికిత్స అందిస్తున్నామని అన్నారు, పట్టణంలో గంటన్నర వ్యవధిలో కుక్కలు బీభత్సం సృష్టించినాయని, కనిపించిన వారిపై విచక్షణ రహితంగా,

దాడి చేయడంతో, అనిల్ కుమార్, సురేష్, శేఖర్, చంద్రయ్య, నితిన్, బాబు, సాయిలు, యాదిరెడ్డి, అవంతిక, లక్ష్మి, అనూష, సత్యనారాయణ, షబానా, మన్సుక్ దీక్షిత, వెంకటేష్, గాయాలయ్యాయి, వీరికి డాక్టర్ అమర్ సింగ్ అవసరమైన ఇంజక్షన్లు మందులు వేసినట్లు తెలిపారు, ఈ కథనంలో పట్టణ ప్రజల్లో నెలకొంది, పట్టణంలో రోజురోజుకీ పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను నియంత్రించకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవుతాయని స్థానికులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు, తక్షణమే అధికారులు స్పందించి కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి ప్రజలు డిమాండ్ చేశారు.