calender_icon.png 4 October, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత శోభాయాత్రలో పాల్గొన్న ఎస్ఐ సౌజన్య

03-10-2025 11:34:51 PM

బేజ్జంకి: బేజ్జంకి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన దుర్గామాతను శుక్రవారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు.  స్థానిక ఎస్సై బోయిన సౌజన్య దుర్గామాత  శోభాయాత్రలో అమ్మవారిని దర్శించుకున్నారు, కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదం అందించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహిళా భక్తులు దుర్గామాతకు తొమ్మిది రోజులు వైభవంగా పూజలు చేశారు. చివరి రోజు దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కోలాటాలు, నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆలయ సమీపం లోని కొలనులో  నిజ్జనం చేశారు. ఎస్‌ఐ  ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు , గ్రామస్తులు పాల్గొన్నారు.