03-10-2025 11:00:48 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో గత రెండు సంవత్సరాలు ఏకాదశి మహా యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు తృతీయ వార్షిక ఏకాదశి మహా యజ్ఞాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, శశిరేఖ దంపతుల ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం యజ్ఞాన్ని నిర్వహించి తీర్థ ప్రసాద పంపిణీ చేశారు. ఎంతో ముక్తిని ప్రసాదించి ఏకాదశి మహా యజ్ఞం ఏడాది పాటు నిర్విఘ్నంగా నిర్వహించడం విశేషమని భక్తులు యాగంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని పూజారి తెలిపారు. ప్రతిపక్షం రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి హోమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల భక్తులు తమను సంప్రదించాలని పూజారి తెలిపారు.