calender_icon.png 4 October, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

03-10-2025 10:56:38 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి):  మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ.... గాంధీ సేవలు ఎనలేనివి జాతిపిత అహింస వాదంతో దేశానికి స్వతంత్రం తెచ్చిన నేత అని అన్నారు. రెండో ప్రధానిగా దేశానికి సేవలందించిన లాల్ బహుదూర్ శాస్త్రి సేవలు మరువలేనివి అన్నారు. ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ... గాంధీ జీ లాల్ బహదూర్ శాస్త్రి కలలుగన్న దేశాన్ని తయారు చేసేందుకు బిజెపి ప్రభుత్వంలో మోదీ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.