03-10-2025 11:20:50 PM
ముదిరాజుల ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గానుగబండ గ్రామంలోని ముదిరాజ్ లు విజయ దశమి పర్వదినం సందర్భంగా పాండవులకు బోనాలు సమర్పించారు. గ్రామ దేవతల వద్ద సొరకాయను నరికి ఆయుధ పూజ నిర్వహించారు. పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలను విజయ దశమి నాడు జమ్మి చెట్టు మీద పెట్టీ ఆయుధ పూజ నిర్వహించిన సందర్భంగా వారి గుర్తుగా ప్రతి సంవత్సరం ముదిరాజ్ కులస్తులందరూ డీజే పాటలతో సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఈద సైదులుతో పాటు ముదిరాజులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పలువు పాల్గొన్నారు.