calender_icon.png 4 October, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయ డంక

03-10-2025 10:50:42 PM

- కాంగ్రెస్ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోండి

- వెన్నుపోటు దారులకు ప్రజలే గుణపాఠం చెబుతారు

- కారు గెలవాలి.. కెసిఆర్ కావాలి అని జనంలో ఉండి మాజీ ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ రూరల్: ఎంపీటీసీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయ డంక మోగుతుందని బీఆర్ఎస్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ మండల  స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో విజయ డంక మోగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కెసిఆర్ ఏ.. కావాలి...కారే గెలవాలి అనేది ప్రజల్లో బలంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పాలన ఫెయిల్యూర్ అయిందని జనమంతా కెసిఆర్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారన్నారు తనతో లబ్ధి పొంది పనులు చేయించుకొని వెన్నుపోటు పొడిచారన్నారు పార్టీ ఫ్రెండు అంతా సైనికులు లాగా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు ప్రత్యర్థి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని బట్టి మనం దీ టైన అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు మనమే గెలుస్తున్నట్లు తన వద్ద సర్వే నివేదిక ఉందని పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆపలేరన్నారు రిజర్వేషన్ కారణంగా అవకాశం దొరకని వారికి పార్టీలో సరైన స్థానం కల్పిస్తామన్నారు.