03-10-2025 10:45:45 PM
నకిరేకల్,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చికెన్ అమ్మకాలపై నిషేధమని మున్సిపల్ కార్యాలయం నుండి నోటీసులు ఇచ్చినప్పటికీ గురువారం పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో జానీ చికెన్ సెంటర్, మెయిన్ రోడ్డులో శంకర్ చికెన్ సెంటర్, బాబా చికెన్ సెంటర్ నిర్వాహకులు అమ్మకాలు కొనసాగించారు. నిబంధనలకు విరుద్ధంగా చికెన్ అమ్మకాలను కొనసాగించిన దుకాణాల యజమానులకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ. రంజిత్ కుమార్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.