calender_icon.png 15 July, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు కింద పడి విద్యార్థిని మృతి

15-07-2025 12:14:35 AM

కుత్బుల్లాపూర్, జులై 14 (విజయ క్రాంతి): ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సం ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీజ (16) అనే విద్యార్థిని కూకట్పల్లి ఎస్‌ఆర్ గాయత్రి కాలేజ్‌లో ఇంటర్ చదువుతుంది.

సోమవారం ఉదయం కాలేజ్‌కి వెళ్దామని ఆల్వి న్ కాలనీ కెఎల్ బార్ ముందు బస్సు కోసం ఎదురుచూస్తుంది. రద్దీగా ఉన్న బస్సు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.