16 April, 2026 | 6:44 AM

రాష్ట్రస్థాయి యస్.జి.ఎఫ్ బాస్కెట్ బాల్ పోటీలకు పారమిత విద్యార్థిని

25-11-2025 12:00 AM

కొత్తపల్లి, నవంబరు 24 (విజయ క్రాంతి): ఈ నెల 25 నుండి 27 వరకు నిర్వహించనున్న ఎస్ జి ఎఫ్ 69వ రాష్ట్రస్థాయి అండర్-17(బాల బాలికల) బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థి సి.హెచ్. హేమంత్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు. ఇటీవల అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో హేమంత్ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు.

ఈ సం దర్భంగా విద్యార్థిని పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, కె.హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గో పికృష్ణ, సమన్వయకర్తలు నాగరాజు, రాము, వ్యాయామ ఉపాధ్యాయుడు సాజన్, రాజు లుఅభినందించారు.