calender_icon.png 8 July, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు టై, బెల్టు, బూట్లు, ఐడి కార్డులు బహుకరణ

08-07-2025 05:30:56 PM

చిలుకూరు: చిలుకూరు మండలం(Chilkur Mandal) జెర్రీ పోతుల గూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం పి. సైదయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు ఉద్దండు నారాయణ పాల్గొని విద్యార్థులకు బూట్లు, టై, బెల్టు, ఐడి కార్డ్స్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారి మాది గురవయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విలువలతో కూడిన విద్య సకల సౌకర్యాలతో అందుతుందని తల్లిదండ్రులు ఇట్టి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పేద విద్యార్థులకు చేయూతనిస్తున్న ఉదండు నారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఏపిసి చైర్మన్ మొక్క, సాగరిక, గ్రామ పెద్దలు రామిశెట్టి, కోటయ్య, రెమిడాల, రాజు, కే వెంకటయ్య, నాగుల్ పాషా, జానీ పాషా, జావీ ద్, మహేష్, పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.