calender_icon.png 8 July, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీఓ మృతికి సంతాపం

08-07-2025 05:33:07 PM

మందమర్రి (విజయక్రాంతి): జనగాం జిల్లా(Jangaon District) పాలకుర్తి మండలం ఉపాధి హామీ పథకం ఏపీఓ కమ్మగాని శ్రీనివాస్ అకాల మృతి పట్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్, ఏపీఓ రజియా సుల్తానలు సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత ఏపీవో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీ మధు, టి ఏలు రాజమల్లు, కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా గౌరవాధ్యక్షులు ఈద లింగయ్యలు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.