calender_icon.png 6 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఉపాధ్యాయుడితో విద్యార్థుల అవస్థలు

06-11-2025 07:54:43 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండడం వలన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేరడ ప్రాథమిక పాఠశాలలో మొత్తం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంచే ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠ్యాంశాలు సాఫీగా సాగిపోయావని మరొక ఉపాధ్యాయుడు పదోన్నతితో బదిలీ కావడంతో ఒకే ఉపాధ్యాయుడు వీరికి బోధిస్తున్నారు.

అన్ని తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంలో ఇబ్బందికరంగా మారిందని, విద్యార్థులకు సమయానుగుణంగా పాఠ్యాంశాలు అయిపోవటం లేదని, అంతేకాకుండా ఒకే ఉపాధ్యాయుడు ఉండడం చేత అన్ని తరగతుల విద్యార్థులను ఒకే తరగతిలో కూర్చోబెట్టి చదివించటంతో విద్యార్థులు ఎంతో అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు కావలసిన టీచర్లను నియమించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.