calender_icon.png 17 October, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరిక్ష పరిశోధన సంస్థ సందర్శనకు విద్యార్థినుల ఎంపిక

17-10-2025 06:31:11 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సందర్శనకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి తెలిపారు. టాప్ 30 విద్యార్థినులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జిల్లా స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలకు చెందిన కుమ్మరి అక్షర, కుమ్మరి తరణిలు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ విద్యార్థినులు మరెన్నో విజయాల సాధించాలని ఆయన ఆకాంక్షించారు.