13-08-2025 01:15:03 AM
ఘట్ కేసర్, ఆగస్టు 12 : విద్యార్థులు ఆచరణాత్మక దృక్పథంను అలవర్చుకోవాలని అనురాగ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు అన్నారు. పోచారం మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బిబిఎ (హానర్స్) 2025-26 అడ్మిషన్ బ్యాచ్కి సంబంధించిన ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ చేపట్టిన పయనీర్ కార్యక్రమాలను ప్రస్తావించారు. పోటీభరిత వాతావరణంలో విజేతలుగా నిలవాలంటే విద్యార్థులు ఆచరణాత్మక దృక్పథం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అనురాగ్ యూనివర్సిటీ డీన్ (ఎగ్జామినేషన్స్) ప్రొఫెసర్ ముత్తా రెడ్డి మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లోని ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ బాలాజీ ఉట్లా మాట్లాడుతూ లభ్యమయ్యే అవకాశాలను వినియోగించుకుని సమస్య పరిష్కార దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులను కోరారు.ఆరంభ కార్యక్రమం తరువాత, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ బాలాజీ ఉట్లా మరియు ముఖ్య అతిథి సూపర్ విటీ. ఎఐ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీరామ్ పాపాని మధ్య ఫైర్ చాట్ చర్చ జరిగింది.
ప్రస్తుత కాలంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం విద్యార్థులకు అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. బిబిఎ అసిస్టెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీవాణి ధన్యవాదములు తెలిపారు. ఈకార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హెడ్ డాక్టర్ వి.విష్ణువందన, బిబిఎ ప్రోగ్రామ్ డైరెక్టర్ శివప్రియ, బిబిఎ ప్రోగ్రామ్ సలహాదారు ప్రొఫెసర్ పి.ఎస్.ఎస్. మూర్తి పాల్గొన్నారు.