13-08-2025 01:13:44 AM
కేపీహెచ్‌బీలో దొంగల బీభత్సం
చందానగర్ ఖజానాలో దోపిడీ చేసింది వీరేనా?
మేడ్చల్, ఆగస్టు 12(విజయ క్రాంతి), కూకట్ పల్లి: కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు ఒక ఇంట్లో బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో రిటైర్డ్ తహసిల్దార్ నాగేశ్వ రరావు ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధ దంపతులైన నాగేశ్వరరావు (89), సరస్వతి (85) పై దొంగలు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు.
సరస్వతి మీద ఉన్న బంగారం తీసుకొని నెట్టి వేయడంతో గాయపడ్డారు. షాక్ కు గురైన సరస్వతి దాహం దాహం అనడంతో ఒక దొంగ జగ్గులో నీరు తీసుకువచ్చి తాగించాడు. బీరువాను పగలగొట్టి అందులో ఉన్న రెండు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఇంట్లోకి ముగ్గురు చొరబడినట్లు బాధితులు తెలిపారు. తెలుగు మాట్లా డలేదని వేరే భాష మాట్లాడారని తెలిపారు.
పక్క ఇంట్లో చొరబడడానికి యత్నం
నాగేశ్వరరావు ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లో చొరబడడానికి ప్రయత్నించారు. ఆ ఇంట్లో ఒక బాలిక చదువుకుంటుంది. దొం గల అలిపిడి విని ఇంటివారిని అప్రమత్తం చేసింది. దీంతో వారు అరవడంతో దొంగ లు పరారయ్యారు. కూకట్పల్లి ఏసిపి రవి కిరణ్ రెడ్డి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
బాధితుల నుంచి వివరాలు సేకరిం చారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని ఆయన అన్నారు. సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టీము లు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.
ఖజానాలో దోపిడీ చేసింది వీరేనా?
చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో మంగళవారం ఉదయం దోపిడీ చేసింది వీరేనా కోణంలో పోలీసులు విచారిస్తున్నా రు. నాగేశ్వరరావు ఇంట్లో ముగ్గురు చొరబడినప్పటికీ మరి కొంతమంది బయట ఉండ వచ్చని, అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఉదయం ఖజానాలో దోపిడి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
వృద్ధ దంపతులు షాక్ నుంచి చేరుకున్న తర్వాత ఖజానాలోని సీసీ పుటేజీలను చూయించి రెండు చోట్ల ఒకటే ముఠాన, లేక వేరువేరు ముఠాల అని నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది.