calender_icon.png 7 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు కరాటే నేర్పించాలి

06-07-2025 12:00:00 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వాలి. వారంలో ఆరు రోజులు కాకపోయినా, కనీసం రెండురోజులైన శిక్షకులతో శిక్షణ ఇప్పిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ముఖ్యం గా ఆడపిల్లలకు కరాటే విద్య ఎంతో అవసరం.

నానాటికీ వారిపై  దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో ఆత్మరక్షణ విద్య నేర్చుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. అవసరమైతే శిక్షకులకు గౌరవ వేతనం ఇచ్చేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. వార్షిక బడ్జెట్లలో కొంత వరకైనా బడ్జె ట్ కేటాయింపులు చేయాలి. అలా చేస్తే ప్రభుత్వ పెద్దలకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఇక రాజకీయ నేతలకు స్థానికంగా పలుకుబడి కూడా పెరుగుతుంది. తద్వారా వారి రాజకీయ ప్రయో జనాలు కూడా సాకారమవుతాయి.

షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్