calender_icon.png 7 July, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణాన్ని పరిరక్షించాలి

06-07-2025 12:00:00 AM

పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జం తు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. భారతీయ మహర్షులు పర్యావరణాన్ని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండోది అంతర్గత పర్యావరణం.

ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. దానిని మనం అ ర్థం చేసుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారత్‌లో  ఏటా యాభై ఆరు లక్షల టన్నుల చెత్త పోగు పడుతోంది. ప్రస్తుతం భారత్‌లో 14  బిలియన్ టన్నుల మేర చెత్త పేరుకున్నది. అది శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. పెరుగుతున్న ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడానికి చైనా పదేళ్ల నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తు పై నియంత్రణ చేపట్టింది. కెనడాలో ఏకంగా ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్రాన్స్‌లో నైతే 2016లో ప్లాస్టిక్ నియంత్రణ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం సాధారణ అవసరాలకు వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు మొదలైన వాటిపై నిషేధం ఉంది. ప్లాస్టిక్ పై నిషేధం విధించకుండానే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగిన దేశం ప్రపంచంలో ఐర్లాండ్ ఒక్కటే. భా రీగా జరిమానాల మూలంగా ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 94 శాతం తగ్గిపోయింది. మలేషియా కూడా వివిధ దేశాల నుంచి ప్లాస్టిక్ నియంత్రించింది. ఇక భారత్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.

సింగు లక్ష్మీనారాయణ, కొత్తపల్లి