calender_icon.png 26 August, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

26-08-2025 03:02:59 AM

గ్రాడ్యుయేషన్ డేలో జేఎన్టీయూహెచ్ రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): బీటెక్ పూర్తయిన విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి తల్లిదండ్రులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని జేఎన్టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా బోగారంలోని హోలిమేరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో సోమవారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ఆయన మాట్లాడారు.  నాలుగేళ్ల గ్రాడ్యుయేష న్ చేయడం ముఖ్యం కాదని భవిష్యత్‌లో ఏం సాధించాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఎంత శ్రమపడైనా ఆ లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

భావి ఇంజినీర్లుగా ఎదిగి కాలేజీ యాజమాన్యానికి, సమాజానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపుని చ్చారు. దేశం గర్వించదగిన ఇంజినీర్లుగా స్థిరపడాలన్నారు. యువత వ్యసనాలకు దూరం గా ఉండి, జూనియర్లకూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం 286 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో హోలిమేరి కాలేజీ చెర్మైన్ సిద్ధార్థరెడ్డి, కార్యదర్శి ఏ వరప్రసాద్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి ఏ విజయశారదారెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.