26-08-2025 03:04:19 AM
మేడ్చల్, ఆగస్టు 25(విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాలకు మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ ను కలిసి గణేష్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. నేరేడ్మెట్ డివిజన్లోని జేజే నగర్ లో బి అండ్ బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుపుతామని సందీప్ తెలిపారు.