calender_icon.png 3 January, 2026 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత రంగంలో రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యం

03-01-2026 12:28:06 AM

టెస్కో మేనేజింగ్ డైరెక్టర్ శైలజ రామయ్యర్

టెస్కో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ముషీరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): చేనేత రంగంలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యమని టెస్కో మేనేజింగ్ డైరెక్టర్, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం టెస్కో కార్యాలయంలో టెస్కో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్‌ను శైలజ రామయ్యర్ ఆవిష్కరించి మాట్లాడారు. చేనేత రంగాన్ని ప్రోత్స హించేందుకు ప్రభుత్వం అనేక కార్యాక్రమాలు చేపడుతుందన్నారు.

చేనేత రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు ఉద్యోగులు బాధ్యతా యుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించడంతో పా టు వృత్తిని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా శైలజ రామాయ్యర్ ను టెస్కో ఎం ప్లాయిస్ యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టెస్కో, జనరల్ మేనేజర్‌లు ఎన్. వెంకటేశ్వర రావు, రఘునందన్ రావు, రతన్ కుమార్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక, కార్యదర్శులు విజయ్ కుమార్, సుధాకర్‌రెడ్డి, డిఎంఓ కళింగ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు సందీప్, కె.టీ చారి తదితరులు పాల్గొన్నారు.