calender_icon.png 26 July, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయల సాగుకు రాయితీలు

26-07-2025 12:09:59 AM

హార్టికల్చర్ డివిజన్ ఆఫీసర్ కీర్తి కృష్ణ

చేవెళ్ల, జులై 25:కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని చేవెళ్ల డివిజన్ హార్టికల్చర్ ఆఫీసర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టమాట, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలు సాగు చేయాలనుకునే రైతులు 40 నుంచి 50 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే.. జీడిమెట్లలోని సెంటర్ అఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ) నుంచి నారును ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.

అయితే రవాణా ఖర్చులు రైతులే పెట్టుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. వంకాయ లో అంటు ( గ్రాఫట్స్) మొక్కలు రాయితీపై లభిస్తాయని, ఎకరానికి 2000 మొక్కలు పాటు మల్చింగ్ షీట్ వేసి, ట్రేలిస్ పై సాగు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రూ. 5వేలు డీడీ రూపంలో ‘ADH COE - JEEDIMETLA’ పేరు మీద చెల్లించాలని సూచించారు.

అలాగే మల్చింగ్, డ్రిప్పు ఎకరాకు రూ.6,400 , బీర, కాకర, దొండ, సొర, పొట్లకాయ లాంటి తీగ జాతి కూరగాయలు పెంపకానికి శాశ్వత రాతి కడీలు , సిమెంట్ కడీల పందిరిపై ఎకరానికి రూ. లక్ష సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఎకరాకు 200 కడీలు, 15 క్వింటల్స్ జీఐ వైరు పడుతుందని, గరిష్టంగా ఒక రైతు కు రెండున్నర ఎకరాల వరకు ఇది వర్తిస్తుంది వెల్లడించారు. కావాలనుకున్న రైతులు రైతులు ప ట్టా పాసుబుక్, బ్యాంకు పాసుబుక్, ఆధార్ కార్డుల జీరాక్స్ లు, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో జత చేసి ఉద్యాన అధికారికి ఇవ్వాలనిసూచించారు.