calender_icon.png 9 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్‌స్టేషన్ స్థల పరిశీలన

06-01-2026 12:58:08 AM

హాజీపూర్, జనవరి 5: హాజీపూర్ మండలం రాపల్లి ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే నూతన సబ్‌స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీరి వెంట విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులున్నారు.