calender_icon.png 14 May, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీయ దర్శకత్వంలో మరో చిత్రం

12-05-2025 01:52:23 AM

చిత్ర పరిశ్రమలో తన బహుముఖ ప్రతిభను చాటుతున్నారు విశ్వక్‌సేన్. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలతో నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా నిరూపించుకున్నారు. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ కొత్త చిత్రానికి విశ్వక్ దర్శకత్వం వహించడమే కాదు.. కథను సైతం తానే రాసుకోవడం విశేషం. ‘కల్ట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో కొత్త ప్రాజెక్టుకు ఆదివారం కొబ్బరికాయ కొట్టేశారు.

తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌లో గోట్ మాస్క్ ధరించిన ఉన్న విశ్వక్ లుక్ ఆసక్తిని రేకెత్తించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రారంభ పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పూజాకార్యక్రమాలతోపాటే రెగ్యులర్ షూటింగ్‌నూ ప్రారంభించారు.

ఈ సినిమాతో 40 మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రఫీ అర్వింద్ విశ్వనాథన్, ఎడిటింగ్ రవితేజ గిరిజాల, ఆర్ట్ డైరెక్షన్‌ను అర్వింద్ ములే నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కాబోతోందీ చిత్రం.