03-01-2026 10:30:41 PM
శ్రీరంగాపూర్: వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండలంలో యాసంగికి సరిపడా యూరియా ఎరువుల నిలువలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి హైమావతి తెలిపారు. మండలంలో శనివారం నాడు పిఎసిఎస్, ప్రవేట్ ఎరువుల దుకాణాలను ఏఈఓలతో కలిసి తనిఖీ చేశారు. సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలో దాదాపు 115 మెట్రిక్ టన్నుల యూరియా రైతుల కోసం అందుబాటులో ఉంచామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆధార్ పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలను యూరియా డీలర్లకు అందజేస్తే ఈపాస్ యంత్రంలో నమోదు చేసి పంటల ఆధారంగా యూరియా రైతులకు అందజేస్తారని అమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అనూష, పిఎసిఎస్ సిబ్బంది, డీలర్లు ఉన్నారు.