calender_icon.png 6 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

06-11-2025 12:43:54 AM

-డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మీన్‌రెడ్డి 

-మనస్తాపానికి గురై బలవన్మరణం

-కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఘటన

మల్కాజిగిరి, నవంబర్ 5 (విజయక్రాంతి): డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తి.. మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. జమ్మిగడ్డ, భగత్ నగర్‌కి చెందిన సింగిరెడ్డి మీన్‌రెడ్డి (32) ఇటీవల కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఆటోతో పట్టుబడ్డాడు.

ఆటో సీజ్ కాగా, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మీన్‌రెడ్డి మౌలాలి ప్రాంతంలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పి, తీవ్ర గాయాలతో ఉన్న మీన్ రెడ్డిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరిం చారు. ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.