10-07-2025 12:40:56 AM
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
4.45 లక్షలు ఎకరాల్లో సాగు
తెల్ల బంగారం సాగుకే రైతుల మొగ్గు
కుమ్రం భీం ఆసిఫాబాద్ , జూలె ై9 ( విజయక్రాంతి): పత్తి పంటను తెల్ల బంగారంగా భావించే రైతులలో సాగుకు వాతావర ణం అనుకూలంగా ఉండడంతో వారిలో ఆశలు మొలకెత్తాయి.జిల్లాలో రైతులు పత్తి సాగుకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వరి ,కంది పంట సాగు చేస్తుంటారు.జూన్ మాసానికి ముందే వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులను ఏడాది ముందుగానే ప్రారంభించారు.
మొద ట్లో వర్షాలు అనుకూలంగా కురిసినప్పటికీ తర్వాత ముఖం చాటే యడంతో కర్షకుడు నిరాశకు గురయ్యారు .విత్తనాలు నాటినప్పటికీ సరైన సమయంలో వర్షాలు పడకపోవ డంతో విత్తనాలు మొలకెత్తగా కొంతమంది రైతులు రెండో దఫా విత్తనాలు పెట్టారు.జూన్ చివరి మాసం నుండి జిల్లా వ్యాప్తంగా వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పత్తికి జీవం పడింది.విత్తనాలు మొలకలు వచ్చి పెరగడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తుంది.
జులై నెల చివరి వరకు విత్తనాలు వేసుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు సూచించడంతో వర్ష బావా పరిస్థితిలను బట్టి మొలకెత్తని విత్తనాల స్థానంలో మళ్లీ నాటుకుంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తికి అనుకూలంగా ఉన్నాయి.అతిగా కురిస్తే అనావృష్టి వస్తుందని రైతులు భావిస్తున్నారు.ఇప్పటికీ కురుస్తున్న వర్షాలు వ్యవ సాయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వాతావరణంలో వస్తున్న మార్పులతో అన్నదాత లలో ఆందోళన సైతం లేకపోలేదు.
తెల్ల బంగారానికే రైతుల మొగ్గు..
జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.జిల్లాలో రైతులు తెల్ల బంగారం సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో 3.35 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు అయ్యే అవకాశం ఉందని అంచనా.వరి 55 వేల ఎకరాలు ,కంది 32 వేల ఎకరాలలో సాగు అవుతుండగా పెసర, సోయాబీన్, మిర్చి ,ఇతర చిరుధాన్యాలతో పాటు కూరగాయలు 6 వేల ఎకరాలలో రైతులు సాగు చేస్తున్నారు.
విడతల వారీగా ఎరువుల పంపిణీ..
కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతులకు అవసరానికి సరిపడా ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.జిల్లాకు యూరియా 60 వేల మెట్రిక్ టన్నులు,డి ఏ పి,కాంప్లెక్స్ ఎరువులు 45 వేల మెట్రిక్ ట న్నులు, పొటాష్ 25 వేల మెట్రిక్ టన్నులు పంటలకు వినియోగించాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.మొదటి దఫలో 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా,
18 వేల మెట్రిక్ టన్నుల డిఏపి ,కాంప్లెక్స్ 230 టన్నుల పోటాష్ జిల్లాకు వచ్చింది.సేంద్రియ వ్యవసాయం, భూ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడతలవారీగా ఎరువులను పంపి ణీ చేసేందుకు చర్యలు తీసుకుంది.జిల్లాలో సాగుకు సరిపడా ఎరువులు వస్తాయని ఆందోళన చెందవలసిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
నానో ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి....
భూసారం పరిరక్షణ కోసం నానో ఎరువు లు వాడాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్త లు సూచిస్తున్నారు. నానో ఎరువులు మొక్కపై పిచికారి చేయడంతో భూమికి ఎలాంటి నష్టం లే దని ఎరువు నేరుగా మొక్క పొందడంతో ఏపు గా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.ఒక లీటర్ నానో రెండు ఎకరాల వరకు పిచికారి చేసుకోవచ్చని చెబుతున్నారు.
నానో ఎరువును రెండుసార్లు పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.జిల్లాలో ఎరు వుల వాడకం రైతులు ఇష్టానుసారంగా వేయడంతో భూసారం దెబ్బ తినడంతో పాటు పంటల దిగుబడిపై కూడా ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు.ఎకరానికి భూమిని బట్టి 90-120 కేజీల యూరియా వేయాల్సి ఉండగా ఇస్టానూసారంగా ఎరువుల వినియోగం పెరుగుపోతుందని శాస్త్రవే త్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతు నేస్తం ద్వారా అవగాహన..
రాష్ర్ట ప్రభుత్వం రైతులు పండిస్తున్న పంటలపై సూచనలు సలహాలు అందజేసేందుకు ప్రత్యేకంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.ప్రతి మంగళవారం రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులుపంట సాగు లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలుకువలు, సలహాలు, సూచనలను అందజేస్తుంటారు.
అవసరానికి అనుగుణంగా ఎరువులు
జిల్లాలో వ్యవసాయానికి సరిపడా ఎరువులు తీసుకువచ్చేందుకు చర్యలు తీ సుకోవడం జరుగుతుంది.60 వేల మెట్రి క్ టన్నుల యూరియా,45 వేల మెట్లు టన్నుల కాంప్లెక్స్ ఎరువులు,25 వేల మె ట్రిక్ టన్నుల పొటాషియం కోసం ఇం డెంట్ పంపించడం జరిగింది.మొదటి విడతగా 25 వేల యూరియా 18 వేల కాంప్లెక్స్ ఎరువులు, 230 టన్నుల పోటా ష్ జిల్లాకు వచ్చింది.
ఆగస్టు లో రెండో విడత ఎరువులు వస్తాయి.రైతులు ఎరువుల కోసం సమయాన్ని వృధా చేసుకో కుండా అవసరానికి సరిపడా తీసుకోవాలని కోరుతున్నాం. ఎరువులు లేవనే పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
రావూరి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి