10-07-2025 12:01:17 AM
వనపర్తి, జూలై 9 ( విజయక్రాంతి ) : జిల్లా కేంద్రం శివారు లో గల మాత శిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో గల షెడ్ లో విద్యుత్ సౌకర్యం ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మాత శిశు సంరక్షణ కేంద్రానికి ప్రసవం కోసం వచ్చే గర్భిణీ స్త్రీల కు సంబందించిన సహాయకులు ఉండేందుకు కోసం ఏర్పాటు చేసిన ఒక షెడ్ లో విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న అంశాన్ని ఈ నెల 5 వ తేదిన ‘ కలెక్టర్ సారు...
జర చూడరా? ‘ అనే కథనాన్ని విజయక్రాంతి దినపత్రిక లో ప్రచురించడం జరిగింది. అందుకు స్పందించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి షెడ్ లో విద్యుత్ సౌకర్యం ను ఏర్పాటు చేయించారు. దింతో ఆసుపత్రి కి వచ్చిన సహాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు