calender_icon.png 28 November, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థిగా సుండు నర్సయ్య నామినేషన్ దాఖలు

28-11-2025 12:00:00 AM

నిజామాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి):  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ధర్మారం గ్రామా నికి చెందిన సుండు నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ను అధికారుల సమ క్షంలో జైతపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈసారి ధర్మా రం గ్రామానికి జనరల్ రిసర్వేషన్ కేటాయించటం జరిగింది.

నామినేషన్ సమర్పించిన అనంతరం సుండు నర్సయ్య మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం మరియు మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి ధర్మారం అభివృద్ధి పథంలో ముం దుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.