15-11-2025 08:43:55 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ గవర్నమెంట్ హై స్కూల్ ను, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు గోగుల సరిత శనివారం నాడు పర్యవేక్షించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్కూల్లోని, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏ విధంగా బోధన చేస్తున పద్ధతులను, ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకుని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. తరగతి గదిలో శుభ్రత, తాగునీటి సదుపాయం, విద్యార్థులకు అందించబడుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను, వారికి అందించబడుతున్న రోజువారి మెనూ పరిశీలించారు.
వంట చేసే సిబ్బందితో మాట్లాడి, షుచి, శుభ్రత పాటించేటట్లు, వంట వారికి పలు సలహాలు, సూచనలు చేసినారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మున్సిపల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.