15-11-2025 09:16:07 PM
ఆదివాసి జేఏసీ నాయకులు
మణుగూరు,(విజయక్రాంతి): బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసి జాతి హక్కుల కోసం ఉద్యమాలు చేసి అమరుడైన భగవాన్ బిర్సా ముండా ఆశయాల స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మండల ఆదివాసి జేఏసీ నాయకులు అన్నారు. శనివారం భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ అధ్యక్షులు సోడే రవికుమార్ దొర మాట్లాడారు. ముండా ఆశయాల స్ఫూర్తితోనే ఆదివాసులు ఇప్పటివరకు హక్కుల కోసం పోరాడు తూనే ఉన్నారని పేర్కొన్నారు. స్వాభిమాన్ దివస్ పేరిట ఆయన జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించడం హర్ష నీయమని ఆయన చూపిన బాటలోనే నడవాలని కోరారు. కార్యక్రమంలో నాయ కులు పూనెం రమేష్, జోగ సురేందర్, కోడి నాగరాజు, పూనెం నాగరాజు, మండారి కృష్ణ, ఉద్యోగ సంఘ నాయకులు సింగం రవిబాబు పాల్గొన్నారు.