15-11-2025 09:35:13 PM
చేవెళ్ల,(విజయక్రాంతి): చేవెళ్లలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు చేవెళ్ల న్యూస్ గ్రూప్ అండగా నిలిసింది. సామాజిక బాధ్యతను గుర్తించి ఆ చిన్నారులకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిన్నారుల ఆర్థిక పరిస్థితి వివరించి వారికి వాట్సాప్ వేదిక ద్వారా పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేశారు. సేకరించిన డబ్బుల ను పలువురు జర్నలిస్టులు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాఘవేందర్, మహేష్, శ్రీనివాస్, శ్రావణ్, పూర్ణచందర్, రాజు, తదితరులు గ్రామ సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు.