calender_icon.png 15 November, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆందోళనకు సిద్ధం

15-11-2025 09:21:33 PM

ఈనెల 21న జాతీయ రహదారి దిగ్బంధం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): అన్నదాతలకు అండగా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రైతుల సమస్య పరిష్కారానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈనెల 21న భోరజ్ సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ పంప్ వద్ద జాతీయ రహదారిపై నిరసన నిర్వహించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘం నేతలతో కలిసి "హలో రైతన్న చలో భోరజ్" ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు.

రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. ఎటువంటి తేమ శాతం నిబంధనలు లేకుండా మద్దతు ధరతో పత్తి, సోయా కొనుగోలు చేయాలనీ, కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలన్నారు. ఎకరానికి ఏడూ క్వింటల్ల పరిమితి కాకుండా పాత పద్దతిలో పదమూడు క్వింటాల్లు కొనుగోలు చేయాలన్నారు.

సోయా బీన్ కొనుగోళ్ళలో ఫింగర్ ప్రింట్ విధానాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టనున్న ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. నాయకులు అజయ్, నారాయణ, యాసం నర్సింగ్, బండి దత్తాత్రి, కొండ రమేష్, సిర్రా దేవేందర్, లోకారి పోశెట్టి, చిలుక దేవిధస్, యూనిస్ అక్బనీ, గండ్రత్ రమేష్, సాజిదొద్దీన్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు