15-11-2025 09:26:08 PM
చేవెళ్ల,(విజయక్రాంతి): చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో నూతన ఎంబిబిఎస్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విఫ్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ వరద రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగాబి ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు ఉత్తమ వైద్యులుగా ఎదిగి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
మహేందర్ రెడ్డి ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతిభావంతులైన వైద్య విద్యార్థులకు నగదు బహుమతులు గా మెడికల్ కౌన్సిలింగ్ నుండి బంగారు పతకం అందుకున్న శివాని గౌడ్ లక్ష రూపాయలు, రూ. 75,000 సునీల్ ఘాట్ కర్, ముహమ్మద్ అజ్మిన్ 50,000, ముసైబా కు రూ. 25000 చెక్కులను అందించారు.