15-11-2025 09:12:50 PM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కుల పంపిణీ
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ పట్టణం పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ పరిధిలోని అర్హులైన 19 మంది లబ్ధిదారులకు 07 లక్షల విలువ గల,రూరల్ మండల పరిధిలో అర్హులైన 10 మంది లబ్ధిదారులకు 03 లక్షల 48 వేల విలువ గల,అర్బన్ మండల పరిధిలో 6 లక్షల విలువ గల 16 ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు.