calender_icon.png 15 November, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరపాలక సంస్థలో పీహెచ్డీ స్కాలర్స్ పర్యటన

15-11-2025 09:31:07 PM

తడి పొడి చెత్త వేరు చేయడం.. చక్రీయం చేసే విధానం

మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో ఆర్సియూఈఎస్ ఆధ్వర్యంలో జాగ్రఫీలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేస్తున్న విద్యార్థులు పర్యటించారు.నగరపాలక సంస్థ కార్యాలయంను  సందర్శించి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, క్షేత్రస్థాయిలో నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులు, పలు సమస్యలను  నగరపాలక సంస్థ కమిషనర్  త్రిలేశ్వర రావు ను  అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సమీకృత వ్యర్ధాల నిర్వహణ పార్కును సందర్శించి తడి,పొడి చెత్తను వేరు చేయటం,పున చక్రీయం చేసే విధానమును తెలుసుకున్నారు.