calender_icon.png 15 November, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లికి చేరుకున్న సీపీఐ శతాబ్ది జాత

15-11-2025 09:18:34 PM

బెల్లంపల్లి అర్బన్: సీపీఐ శాతాబ్ది జాత బెల్లంపల్లికి చేరుకున్నది. జోడేఘాట్ నుంచి బయలు దేరిన సిపీఐ ప్రచార జాత శనివారం రాత్రి బెల్లంపల్లి కి చేరుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న  సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సీపీఐ జాతలు చేపట్టారు. అందులో భాగంగానే బెల్లంపల్లికి సీపీఐ జాత వచ్చింది. బజార్ ఏరియా లోని భగత్ సింగ్, దివంగత  మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విగ్రహాలకు సిపీఐ పార్టీ రాష్ట్ర అగ్ర నాయకలు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనశంకర్, పూలమాలవేసి జోహార్లు అర్పించారు.

ఈ ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. సిపిఐ వందేళ్ళ చరిత్ర అంతా పోరాటాల దేనని అన్నారు. ఇదే స్ఫూర్తితో మతోన్మాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందన్నారు. మతోన్మాదం నుంచి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలతో సిపిఐ కలసి పనిచేస్తుందన్నారు. మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు , లౌకిక శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.