calender_icon.png 26 July, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆసరా

24-07-2025 12:40:33 AM

- ఆర్టీసీ చేపట్టిన సంబురాల్లో కలెక్టర్ రాజర్షి షా

- జిల్లాలో 1.75 కోట్ల మహిళలు ఉచిత ప్రయాణం చేశారు 

ఆదిలాబాద్, జూలై 23 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పా టునందిస్తూ మహిళలను కోటీశ్వరులు చేయాలన్న దృఢ సంకల్పంతో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో  ఘనంగా సంబురాలు నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్టీసీ సంస్థ ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. పలువురు మహిళా ప్రయాణికులను, ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు.

జిల్లాలో 1.75 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఉచిత ప్రయా ణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా ప్రయాణ సదుపాయాన్ని వినియోగిస్తున్నారని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ప్రయాణ వసతి పొందుతున్నారని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోమరాజు భవాని ప్రసాద్, డిపో మేనేజర్ ప్రతిమ, సారధి కళాకారులు ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఉచిత బస్సు సంబురాలు...

మంచిర్యాల, జూలై 23 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు తెలంగాణ అంతటా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు వినియోగించుకున్న సందర్భంగా మంచిర్యాల బస్టాండ్ లో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.