calender_icon.png 26 July, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ నిరుపేదకు తెల్లరేషన్ కార్డు

24-07-2025 12:41:41 AM

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట(మెదక్), జూలై 23(విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అందించాలన్న ఉద్దేశంతో  ప్రజా ప్రభుత్వం నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, రేషన్ కార్డు పేద కుటుంబాలకు ఎంతో కీలకమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

బుధవారం పెద్దశంకరంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, ఇతర అధికారులతో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తో కలిసి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ అత్యంత నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ చేపట్టిందని ప్రభుత్వం చేసిన ఘనతగా పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని  మెదక్ జిల్లాలో 9,960 కొత్త రేషన్ కార్డులు మంజూరి చేస్తున్నామని, సుమారుగా 34 వేల కుటుంబాలు రేషన్ కార్డులో పేర్లు నమోదు చేయడం జరి గిందని, 45 వేల కుటుంబాలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరుస్తు న్నామన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పెద్ద శంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్ పరిశీలించి వైద్యశాల సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు.