calender_icon.png 27 July, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ పరీక్షలు చేసుకుంటే వ్యాధిని నయం చేసుకోవచ్చు

26-07-2025 05:36:50 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): క్యాన్సర్ పరీక్షలు చేసుకొని వ్యాధి నివారణకు కృషి చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రోటరీ, కిమ్స్, ఐఎంఏ వారి ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం కామారెడ్డిలో రోటరీ క్లబ్, కిమ్స్, ఐఎంఏ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. దాదాపు 300 మంది ఈ క్యాన్సర్ పరీక్ష చేసుకోవడం జరిగిందని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి తెలిపారు.

జిల్లాలో మొదటి సారి ఈలాంటి శిబిరం నిర్వహించడం వలన చాలా మంది నిరుపేదలకు ఉపయోగపడిందన్నారు. కిమ్స్ వైద్యులు మధు మాట్లాడుతూ కామారెడ్డి ఐయంఏ, రోటరీ క్లబ్ వారి సహకారం తో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి భయానిక వ్యాధి కాదని, ప్రజలు క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం వల్ల ముందస్తుగా క్యాన్సర్ మహమ్మారిని అరికటవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి సిడిపిఓ రాణి, కామారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు శంకర్, సెక్రటరీ కృష్ణ హరి, ట్రెజరర్ వెంకట రమణ, రోటరీ సభ్యులు డా బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.