calender_icon.png 27 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువులో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు

26-07-2025 05:30:00 PM

తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి గౌస్ పాషా..

తుంగతుర్తి (విజయక్రాంతి): విద్యార్థుల పాఠశాలలో కష్టపడి చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు పొందినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తుంగతుర్తి జూనియర్ కోర్టు జడ్జి గౌస్ పాషా(Junior Court Judge Ghaus Pasha) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కళాశాలలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల, కళాశాలలో క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు పొందినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు నూతన చట్టాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామం అని అన్నారు.

18 సంవత్సరాలు నిండకుండా వివాహాలు చేసుకున్నట్లయితే అది నేరమని, 18 సంవత్సరాల ఉండకుండా పాఠశాలకు వెళ్లకుండా, కూలి పండ్లు చేయించినట్లైతే బాల కార్మికుల నేరం కింద పరిగణింపబడతారని, బాలికల వేధించినట్లయితే ఫోక్ చట్టం, బాలికలకు ఆస్తి హక్కు, పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పాఠశాల కళాశాలలో టీచర్స్ తో గాని ,ఇతర వ్యక్తులతో గాని ఎటువంటి సమస్యలు ఉన్న తనకు ఫిర్యాదు చేసినట్లయితే, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు చదివే ముఖ్యం, ఉద్యోగాలు అంతిమ లక్ష్యంగా భావించి, కష్టపడి చదివి తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలని కోరారు.

సెల్ ఫోన్  పాజిటివ్గా ఉపయోగించుకొని, తను జడ్జి ఉద్యోగం పొందినట్లు విద్యార్థులకు గుర్తింపు చేశారు. అనంతరం విద్యార్థులతో మమేకమై తన సొంత ఖర్చుతో పండ్లు బిస్కెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, మండల విద్యాధికారి బోయిన లింగయ్య, తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనేపర్తి జ్ఞాన సుందర్. కారంగుల వెంకటేశ్వర్లు, తాళ్ల పెళ్లి సత్యనారాయణ, జిలకర చంద్రమౌళి, రాజారాం నాయక్, సతీష్ నాయక్, వంశి గౌడ్, అనిల్, సునీల్, కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.