26-07-2025 05:26:39 PM
మఠపీఠాధిపతి సద్గురు సోమలింగశివాచార్య మహారాజ్
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామంలోని స్వయంభు ఆది బసవేశ్వరాలయంలో మొదటి శ్రావణ శనివారం పూజలు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మఠాధిపతి సోమలింగ శివ చార్య మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్లం మాజీ ఎంపిటిసి సభ్యురాలు పెద్ద పట్లోల శ్రావణి, దేవేందర్ రెడ్డి ఆదిబసవేశ్వర ఆలయంలో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సద్గురు సోమలింగ శివచార్య మహారాజ్ ని ఘనంగా శాలువాతో సన్మానించారు.
స్వామి ఆశీర్వాదం పొందారు. మన ఊరు ఎప్పుడు పాడిపంటలతో చల్లగా ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ అదిబసవేశ్వర ఆలయంలో ప్రత్యేకహోమం నిర్వహించి అన్నదానకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి, శ్రీధర్ పూజారి, గురు లింగ్ పూజారి, మంజునాథ్, ప్రశాంత్ రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.