calender_icon.png 27 July, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు

26-07-2025 05:14:36 PM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య..

ఘట్ కేసర్: గిరిజన హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Bakki Venkataiah) అన్నారు. పోచారం మున్సిపల్ కొర్రెముల లక్ష్మీనగర్ కాలనీలో జగద్గురువు శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమీషన్ సభ్యులు రమావత్ రాంబాబు నాయక్ చేతుల మీదుగా శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కమిషన్ ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ వర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది అక్కడక్కడ ఆటంకం కలిగిస్తూనే ఉన్నారని వారిపై ఇప్పటికే అనేక శిక్షలు వేయించినట్లు తెలిపారు.

ఎస్టీ, ఎస్సీల హక్కుల పరిరక్షణ కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని గిరిజన హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈవర్గాల ప్రజల హక్కును భంగం కలిగిస్తే సహించేది లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజన సమాజానికి ఒక ఆధ్యాత్మిక మహనీయుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న  గిరిజన బంజారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి ఆరాధ దైవంగా పూజిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో మన రాష్ట్రం మన దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసమే వారి స్ఫూర్తితో సేవాలాల్ మహారాజ్ ఆశయాల కోసం సేవలందించడానికి సేవాలాల్ మహారాజ్ సేవా ఎడ్యుకేషన్ సొసైటీ ఇవాళ సేవాలాల్ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు.

అది కూడా నా చేతుల మీదగా చేయడం చాలా గర్వంగా ఉందని చైర్మన్ పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ, గిరిజన హక్కులను భంగం కలిగిస్తే వదిలిపెట్టేది లేదని, గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అన్యాయం చేయాలని ఎవరైనా అనుకుంటే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు రమణ, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజునాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ శీను రాథోడ్ మాట్లాడుతూ, గిరిజన మహిళ న్యాయపరంగా ప్లాట్ 5/ఎ యజమాని బానోతు లక్ష్మి అనుభవించే హక్కులను భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సురేష్ నాయక్, జోహార్ లాల్ నాయక్ మహిళా రాష్ట్ర అధ్యక్షులు స్వరూప, గుగులోతు సాలమ్మ, బానోతు బన్నీ కురుషోత్ లక్ష్మి, లక్ష్మీపరింగ, ఓయూ జేఏసీ అధ్యక్షులు జి.చంటి నాయక్, బానోతు బుజ్జి బానోతు లక్ష్మి, నరేష్ బీమ్ల నాయక్, బిచ్చ నాయక్, శ్రీశైలం, బహుజన ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ సుమన్, అధ్యక్షులు రణం తదితరులు పాల్గొన్నారు.