26-07-2025 05:11:33 PM
సిద్దిపేట క్రైమ్: ఈ నెల 27న జరిగే లైసెన్స్ సర్వేయర్స్, గ్రామ పాలన అధికారుల(GPO) పరీక్షల దృష్ట్యా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట ఇంచార్జి పోలీస్ కమిషనర్, మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు(SP D.V. Srinivasa Rao) తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, జనం గుమిగూడ వద్దని సూచించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.